Explore

Search

November 7, 2026 6:20 pm

ఆ రెండు స్కూళ్లకు నోటీసులు.. అడ్మిషన్లు తీసుకుంటే అంతే!

చంటి ఛానల్,బోధన్: ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యాసంస్థలపై బోధన్ మండల విద్యాధికారి (MEO) నాగయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని రెండు పాఠశాలలు ఎటువంటి గుర్తింపు లేకుండా అక్రమంగా అడ్మిషన్లు చేపడుతున్నట్లు గుర్తించామని, వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించే ముందు సదరు పాఠశాలకు ప్రభుత్వ అనుమతి ఉందో లేదో సరిచూసుకోవాలని, లేనిపక్షంలో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన హితవు పలికారు. షోకాజ్ నోటీసులు అందుకున్న తర్వాత కూడా నిబంధనలు అతిక్రమించి అడ్మిషన్లు కొనసాగిస్తే, ఆయా పాఠశాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎంఈవో నాగయ్య ఈ సందర్భంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్