Explore

Search

November 7, 2026 6:44 pm

​”బోధన్ ఆత్మ ప్రమాదంలో ఉంది!” – వంద స్తంభాల గుడిపై ఉదయ్ మహరాజ్ సంచలన వ్యాఖ్యలు.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని భీముని బస్తీలో నిర్వహించిన ‘హిందూ సమ్మేళనం’ ఆధ్యాత్మిక చైతన్యంతో వెల్లివిరిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్లారం శ్రీ పిట్ల కృష్ణ మహారాజు, యోగ ధారణ ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ మహరాజ్ మాట్లాడుతూ.. హిందువులందరూ ఐకమత్యంతో సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ బలమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా, బోధన్ ఆత్మ వంటి వంద స్తంభాల గుడి పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, మతమార్పిడులు,లవ్ జిహాద్ వంటి సామాజిక సవాళ్లపై అప్రమత్తంగా ఉండాలని ఉద్బోధించారు. సుమారు 2000 మందికి పైగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఈ సమ్మేళనం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా విజయవంతం చేసిన నిర్వాహకులను వక్తలు ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్