చంటి ఛానల్,బోధన్: స్థానిక రాకాసిపేట్ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు ‘హిందూ సమ్మేళన’ కరపత్రాలను విడుదల చేశారు. మే 2వ తేదీ (02/05/2026) శనివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్, ఉదయ్ మహారాజ్ విచ్చేస్తున్నారు. రాకాసిపేట్ హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు తోకల ధృవకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గుంజరి రాములు, కోశాధికారి బిల్లా శంకర్, కార్యదర్శి మల్లెపూల ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ బాధ్యులు తోకల చిన్నా సాయన్న, ఇర్నాల శంకర్, కొలిపాక బాలరాజు, కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు హాజరై కార్యక్రమాన్ని పరివేక్షించనున్నారు.

