చంటి ఛానల్,బోధన్: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తొలగి, ప్రపంచవ్యాప్తంగా శాంతి సౌభాగ్యాలు విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ పట్టణంలోని శ్రీ విజయసాయి హైస్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో 24 గంటల హనుమాన్ చాలీసా పారాయణాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం ఉదయం వరకు నిరంతరాయంగా సాగింది. ఈ పారాయణంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు పట్టణంలోని హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లోక కల్యాణం కోసం ప్రార్థించారు. బోధన్ ఎంఈవో నాగయ్య, ఎమ్మార్వో విటల్, ఏసీపి శ్రీనివాస్, సీఐ వెంకటనారాయణ ఈ కార్యక్రమానికి హాజరుకాగా, ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణమోహన్-ప్రసూన దంపతులు, మేనేజర్ ఐ.ఆర్. చక్రవర్తి-సువర్చల దంపతులు కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు.

