Explore

Search

November 7, 2026 6:06 pm

తండ్రిని ‘ఆత్మలేని మరబొమ్మ’గా అభివర్ణించిన కవిత.

చంటి ఛానల్,తెలంగాణ: హైదరాబాద్‌లోని మునీరాబాద్ వేదికగా కల్వకుంట్ల కవిత “తెలంగాణ రాష్ట్ర సేన (TRS)” అనే నూతన రాజకీయ పార్టీని శనివారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ‘నియంత’ పాలనగా అభివర్ణించిన ఆమె, ప్రజలకు ‘అమ్మనై’ పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. తన తండ్రి కేసీఆర్ ప్రస్తుతం కొందరు వ్యక్తుల చేతిలో బందీ అయ్యారని, బీఆర్ఎస్ తన ఆత్మను కోల్పోయిందని విమర్శిస్తూ.. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి సామాజిక న్యాయం అనే ఐదు ప్రధాన సూత్రాలతో (పాంచజన్యం) తమ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించిన కవిత, రాబోయే రెండేళ్లలో తమ పార్టీ రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్