Explore

Search

November 7, 2026 6:21 pm

ఇసుక కావాలా? ‘మన ఇసుక – వాహనం’లో బుక్ చేసుకోండి: బోధన్ తహసీల్దార్ విటల్

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలంలోని కల్దుర్కి, సిద్దాపూర్ ఇసుక పాయింట్లు రేపటి( శుక్రవారం) నుండి అందుబాటులోకి రానున్నట్లు తహసీల్దార్ విట్టల్ తెలిపారు. ఇసుక కావాల్సిన వారు ‘మన ఇసుక – వాహనం’ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. ధరల వివరాలను వెల్లడిస్తూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక యూనిట్ ఇసుకకు ₹212, ప్రైవేట్ నిర్మాణాలకు ₹733 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని బోధన్ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్