Explore

Search

November 7, 2026 6:31 pm

​ఖాళీ కుర్చీలే సాక్ష్యం.. బోధన్ అధికారుల బాధ్యతారాహిత్యం!

చంటి ఛానల్,నిజామాబాద్ : ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉన్నాయా? లేక అధికారుల ఇష్టారాజ్యానికి నిలయాలా? అని బోధన్ నీటిపారుదల శాఖ (Irrigation & CAD) కార్యాలయం తీరును చూస్తుంటే అర్థమవుతోంది. ఉదయం 10:30 గంటలకే విధుల్లో ఉండాల్సిన ఉద్యోగులు, మధ్యాహ్నం 12 గంటలు దాటినా కుర్చీల్లో కనిపించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. గత రెండు మూడు రోజులుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో, సుదూర ప్రాంతాల నుండి పనుల నిమిత్తం వస్తున్న ప్రజలు, రైతులు కార్యాలయం బయట పడిగాపులు కాస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. “జీతాలు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ, విధులకు రావడంలో లేదా?” అని బాధితులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, ఈ గైర్హాజరు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కార్యాలయంలో సమయపాలన పాటించేలా చూడాలని ప్రజాసంఘాల నాయకులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్