Explore

Search

November 8, 2026 7:51 pm

సేవా పథంలో మరో మెట్టు.. అల్లే లావణ్యకు కీలక పదవి.

చంటి ఛానల్,నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యురాలిగా అల్లే లావణ్య ప్రతిష్టాత్మక నియామకం పొందారు. సమాజ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుదల, వివిధ రంగాల్లో ఆమె చేస్తున్న నిరంతర కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం ఈ గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించింది. ముఖ్యంగా విద్య, వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, సామాజిక సేవా రంగాల్లో ఆమెకున్న అనుభవం యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో దోహదపడనుంది. “విద్యా, సేవ, అభివృద్ధి – సమాజానికి ప్రేరణ” అనే ఆశయంతో బాధ్యతలు స్వీకరించిన అల్లే లావణ్య కి పలువురు ప్రముఖులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్