చంటి ఛానల్ ,నిజామాబాద్: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం వర్ని మండలం కోటయ్య క్యాంపులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను, రిజిస్టర్లను తనిఖీ చేసిన ఆమె, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని మరియు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. 7వ తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పరీక్షించి, వారికి బహుమతులు అందజేస్తూనే.. వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన కలెక్టర్, పాఠశాలకు మంజూరైన నూతన భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశిస్తూ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

