Explore

Search

November 7, 2026 6:21 pm

కల్దుర్కిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

చంటి ఛానల్,బోధన్: కల్దుర్కి గ్రామంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బోధన్ మండల అధ్యక్షులు సిర్పా సుదర్శన్, జనరల్ సెక్రెటరీ జంగం వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశాభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, న్యాలం శ్రీనివాస్, రాజన్న, సిరిగిరి అశోక్, గంగా కిషన్, ఆలూరి అశోక్ పటేల్, చాందుతో పాటు వార్డు సభ్యులు యోగిత, భావన, అనిత, రామ్, మహేష్, బూత్ అధ్యక్షులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాల రెపరెపలు, “భారత్ మాతాకీ జై” నినాదాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్