Explore

Search

November 7, 2026 6:21 pm

అధికారిని ఢీకొట్టి పారిపోయిన ఇసుక స్మగ్లర్ ఆటకట్టు: కటకటాల్లోకి షేక్ హైదర్!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలంలోని సాలూరా గ్రామానికి చెందిన షేక్ హైదర్ అనే వ్యక్తి అక్రమంగా ఇసుకను తరలిస్తూ, అడ్డుకోబోయిన ప్రభుత్వ అధికారిపై దాడికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. గత నెల మార్చి 30న రాత్రి వేళ ట్రాలీ ఆటోలో ఇసుకను తరలిస్తుండగా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు నిందితుడిని ఆపే ప్రయత్నం చేశారు. అయితే, నిందితుడు ఆటోను ఆపకుండా అధికారిని ఢీకొట్టి అక్కడి నుండి పరారయ్యాడు. దీనిపై ఆర్‌.ఐ. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఏప్రిల్ 1న నిందితుడు షేక్ హైదర్ ని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తూ, అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని బోధన్ ఎస్.హెచ్.వో వెంకటనారాయణ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్