Explore

Search

November 7, 2026 6:21 pm

అధికారుల మెరుపు దాడులు: మూడు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సీజ్

చంటి ఛానల్,బోధన్: నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ అవసరాల కోసం డొమెస్టిక్ (వంట గ్యాస్) సిలిండర్లను వాడుతున్న హోటళ్లపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. శనివారం బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్‌లో గల దావత్ రెస్టారెంట్‌లో రెండు డొమెస్టిక్ సిలిండర్లను, అలాగే న్యూ ఫేమస్ హోటల్‌లో మరొక సిలిండర్‌ను ఆర్‌.ఐ (RI), జి.పి.వో (GPO) సంయుక్తంగా తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్