Explore

Search

November 7, 2026 6:21 pm

శక్కర్ నగర్ రామాయలంలో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి పూజలు!

చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ ప్రాంతంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని వసతులు కల్పిస్తూ, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని, రేపు పట్టాభిషేక కార్యక్రమం వైభవంగా జరుగుతుందని తెలిపారు. పట్టాభిషేకం అనంతరం సుమారు 5,000 మంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం (భోజన సౌకర్యం) ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్