చంటి ఛానల్, హైదరాబాద్: బోధన్ పట్టణానికి చెందిన కరాటే మాస్టర్ మల్లెపూల పల్లవికి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ‘ఝాన్సీ లక్ష్మీబాయి జాతీయ శౌర్య పురస్కారం’ ప్రదానం చేశారు. వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో, గత కొన్ని ఏళ్లుగా పాఠశాల విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తూ ఆమె కనబరుస్తున్న ప్రతిభను గుర్తించి ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సంస్థ ప్రతినిధులు మధుకర్ వైద్యుల, సుమలత, లింబూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ, ఈ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కరాటే రంగంలో మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

