Explore

Search

November 7, 2026 6:30 pm

రైతు పక్షపాతిగా కల్దుర్కి సహకార సంఘం: పెరగనున్న శనగ కొనుగోలు పరిమితి

చంటి ఛానల్,బోధన్​: కల్దుర్కి స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో గురువారం (మార్చి 26, 2026) ఉదయం 10 గంటలకు సంఘ మహాజన సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. అఫీషియల్ పర్సన్ ఇన్-ఛార్జ్ జి. అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు సంఘ పరిధిలోని వివిధ గ్రామాల రైతులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి శ్రీనివాస్ చారి 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలను సభ ముందు ఉంచగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు. ప్రధానంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శనగ కొనుగోలు పరిమితిని పెంచాలని, అలాగే గ్రామాల్లో మొక్కజొన్న, సూర్యకాంతి (సన్ ఫ్లవర్), వడ్ల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సభ్యులు డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశారు. సంఘం లాభాల బాటలో పయనిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేసిన అధికారులు, ఇందుకు సహకరించిన రైతులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతు ప్రతినిధులు మరియు సంఘ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్