Explore

Search

November 7, 2026 6:21 pm

బరితెగించిన దొంగలు: కారు అద్దం పగలగొట్టి రూ. 3 లక్షల అపహరణ.

చంటి ఛానల్ ,నిజామాబాద్: బోధన్ పట్టణంలో పట్టపగలే జరిగిన భారీ దొంగతనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, హరిబాబు అనే వ్యక్తి కెనరా బ్యాంక్ నుండి డ్రా చేసిన రూ. 3 లక్షల నగదును తన కారు డాష్‌బోర్డులో పెట్టి, పని నిమిత్తం గోశాల సమీపంలోని యూనియన్ బ్యాంక్ వద్ద కారు నిలిపి లోపలికి వెళ్లారు. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే గుర్తుతెలియని దుండగులు కారు అద్దాన్ని పగలగొట్టి ఆ నగదుతో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ హెచ్ వో వెంకటనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా, జన సంచారం ఉన్న ప్రాంతంలో ఇలాంటి తెగింపుతో కూడిన దొంగతనం జరగడం పట్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్