చంటి ఛానల్ ,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని బీటీ నగర్ ఎస్ఎస్సి పరీక్షా కేంద్రంలో ఒక ఉర్దూ టీచర్ ఉదయం 9:00 నుండి 9:40 గంటల వరకు ఐడీ కార్డుతో లోపల ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ‘చంటి ఛానల్’ ప్రతినిధి జిల్లా విద్యాశాఖాధికారిని (DEO) ప్రశ్నించగా, వెంటనే స్పందించిన ఆయన విచారణ కోసం అధికారులను పంపారు. అయితే, సదరు టీచర్ ఉదయమే రిలీవ్ అయ్యారని అధికారులు చెబుతున్నప్పటికీ, పరీక్ష మొదలైన తర్వాత ఆ 40 నిమిషాల పాటు సబ్జెక్ట్ టీచర్ లోపల ఏం చేశారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజా నిజాలు వెల్లడించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

