చంటి ఛానల్,బోధన్: స్థానిక మారుతి మందిరంలో గత ఎనిమిది నెలల కాలానికి సంబంధించిన హుండీలను దేవదాయశాఖ పర్యవేక్షణ అధికారి చిన్నయ్య సమక్షంలో శుక్రవారం విప్పడం జరిగింది. ఈ లెక్కింపులో ఆలయానికి మొత్తం రూ. 43,708/- ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రాములు, మాజీ చైర్మన్ గుండేటి శంకర్, ఆలయ అర్చకులు ప్రవీణ్ శర్మ, సిబ్బంది సుధాకర్ మరియు స్థానిక భక్తులు పాల్గొన్నారు. అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ హుండీ లెక్కింపు ప్రక్రియలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించి, ఆలయ రికార్డుల్లో నమోదు చేశారు.

