Explore

Search

November 8, 2026 3:57 pm

అక్రమ ఇసుకపై రెవెన్యూ శాఖ ఉక్కుపాదం.. 20 ట్రాక్టర్ల ఇసుక స్వాధీనం!

చంటి ఛానల్,రెంజల్: మండల పరిధిలోని బోర్గం శివారులో సోమవారం మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసీల్దార్ శ్రావణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 20 ట్రాక్టర్ల పరిమాణంలో నిల్వ ఉంచిన ఇసుక కుప్పలను అధికారులు కనుగొన్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఈ ఇసుకను రెవెన్యూ సిబ్బంది సహాయంతో తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ ఆకస్మిక దాడిలో తహసీల్దార్ శ్రావణ్‌తో పాటు మండల గిర్థవర్, రెంజల్ గ్రామ పాలన అధికారులు ఈశ్వర్, నిఖిల్, గంగాధర్, వీఆర్ఏ ప్రవీణ్ పాల్గొన్నారు. అక్రమ ఇసుక రవాణా మరియు నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్