చంటి ఛానల్,బోధన్: క్రిసెంట్ హై స్కూల్ (CHS) పాఠశాల ప్రిన్సిపాల్ మిస్టర్ మీర్ జావిద్ అలీ విద్యార్థినుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన “గర్ల్స్ వెయిటింగ్ & ప్రేయర్ హాల్” ను ప్రారంభించారు. కుర్చీలు, జానే నమాజ్ వంటి అత్యాధునిక వసతులతో కూడిన ఈ హాల్, విద్యార్థినుల్లో ప్రతిరోజూ నమాజ్ చదివే అలవాటును ప్రోత్సహించేందుకు ఎంతో దోహదపడుతుందని పాఠశాల యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.

