Explore

Search

November 7, 2026 6:21 pm

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన బెల్లల్ గ్రామ పంచాయతీ

చంటి ఛానల్,బోధన్: రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా బోధన్ మండలంలోని బెల్లల్ గ్రామంలో మసీదు వద్ద ముస్లిం సోదరులకు సర్పంచ్ రమావత్ రాజు, ఉప సర్పంచ్ అన్నపూర్ణల ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు మల్లేష్, గ్రామ పెద్దలు బుర్రి లక్ష్మణ్, శ్రీనివాస్, నీలకంఠం గౌడ్, రతన్ రాజు, లింగం, రూప్ సింగ్ తదితరులతో పాటు ముస్లిం సోదరులు అనిఫ్, రఫిక్, నావాజ్, ఇర్ఫాన్, జకీర్మ, మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్