Explore

Search

November 7, 2026 6:44 pm

హోలీ వేళ ఘోర విషాదం: నదిలో మునిగి ఇద్దరు యువకుల మృతి!

చంటి ఛానల్,బోధన్: రంగుల పండుగ హోలీ వేళ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అచన్ పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడుపుదామని మంజీర నదికి స్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర సరిహద్దులోని ఎస్గి వద్ద గోదావరి నదిలో మునిగి రోని చౌదరి మరియు సాయికుమార్ అనే యువకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను వెలికితీసి వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్