చంటి ఛానల్,బోధన్: సాలూర మండల కేంద్రంలోని ప్రజ్ఞశ్రీ హైస్కూల్ 26వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోధన్ ఏసీపీ శ్రీనివాస్, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ప్రతి సబ్జెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా పాటలకు చేసిన డాన్సులు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో బోధన్ ఎంపీపీ శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకట నారాయణ, పీఆర్టీయూ నేతలు ఇలెపు శంకర్, మిద్యల రాజు, హరికృష్ణ, పాఠశాల కరస్పాండెంట్ లతారాజు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

