చంటి ఛానల్,బోధన్: రేపు (మార్చి 3) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని చావిడి హనుమాన్ ఆలయ అర్చకులు ఉదయ్ మహారాజ్ తెలిపారు. మధ్యాహ్నం 3:19 నుండి రాత్రి 6:58 వరకు గ్రహణ కాలమని, చంద్రుడు గ్రహణ స్థితిలోనే ఉదయించడం అత్యంత అరుదైన ఘట్టమని ఆయన పేర్కొన్నారు. గ్రహణ సమయంలో భోజనం, నిద్ర వర్జించాలని.. జపం, ధ్యానం ద్వారా ఆత్మశుద్ధి చేసుకోవాలని భక్తులకు సూచించారు.

