Explore

Search

November 7, 2026 6:31 pm

‘చంటి ఛానల్’ ఎఫెక్ట్: వార్త రాగానే పరుగులు తీసిన అధికారులు!

చంటి ఛానల్,బోధన్: సాలూర మండల కేంద్రంలోని రైతు వేదిక దుస్థితిపై ‘చంటి ఛానల్’ ప్రసారం చేసిన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. రైతు వేదిక నిర్వహణ లేక అపరిశుభ్రంగా మారిందన్న వార్తపై స్పందించిన సంబంధిత అధికారులు, శనివారం ఉదయం సిబ్బందితో కలిసి భవన ప్రాంగణాన్ని శుభ్రం చేయించారు. మెట్లపై పేరుకుపోయిన దుమ్మును, ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలగించి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ క్షేత్రస్థాయి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన ‘చంటి ఛానల్’ యాజమాన్యాన్ని స్థానిక రైతులు అభినందించారు. ప్రభుత్వ భవనాలను నిరంతరం పర్యవేక్షిస్తామని అధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్