Explore

Search

November 8, 2026 7:51 pm

​”నిబంధనలకు పాతర.. పెగడపల్లిలో అక్రమ పౌల్ట్రీ ఫామ్ దందా!”

చంటి ఛానల్ ,బోధన్: పెగడపల్లి గ్రామ శివారులో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కొనసాగుతున్న భారీ కోళ్ల పెంపక కేంద్రంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో “సానవేట్” పేరుతో ఉన్న పాత అనుమతులను అడ్డుపెట్టుకుని, ప్రస్తుతం “శాలిమార్ హేచరీస్ లిమిటెడ్” అనే సంస్థ పంచాయతీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల నుండి ఎటువంటి పర్మిషన్లు లేకుండానే వేల సంఖ్యలో కోళ్లను పెంచుతూ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. బోధన్-బాసర ప్రధాన రహదారి సమీపంలో ఉన్న ఈ ఫామ్ నుండి వస్తున్న విపరీతమైన దుర్వాసన కారణంగా గ్రామంలోని చిన్న పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలు, జ్వరాలు మరియు వాంతులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యదర్శి రెండుసార్లు నోటీసులు జారీ చేసినా యాజమాన్యం తీరు మారలేదని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ అక్రమ కేంద్రాన్ని మూసివేసి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని పెగడపల్లి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్