Explore

Search

November 7, 2026 6:21 pm

న్యాయవాదుల విధుల బహిష్కరణ: రక్షణ చట్టం తేవాలని డిమాండ్

చంటి ఛానల్ ,బోధన్: న్యాయవాదులపై వరుసగా జరుగుతున్న దాడులు, హత్యాయత్నాలను నిరసిస్తూ బోధన్ బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం విధుల బహిష్కరణ చేపట్టారు. నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, న్యాయవాదుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ‘న్యాయవాదుల రక్షణ చట్టం’ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నేడు (17-02-2026) ఏకగ్రీవంగా విధులకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. న్యాయవాదులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు చొరవ చూపాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్