చంటి ఛానల్ ,బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పద్మ శరత్ రెడ్డి దంపతులను బోధన్ ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధిలో విద్యాసంస్థల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొడాలి కిషోర్, హరికృష్ణ, జె.పి, కృష్ణమోహన్, చౌడారెడ్డి, రమణారెడ్డి, విజయ్ కుమార్, సంతోష్, శ్రీనివాసరావు, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

