Explore

Search

November 7, 2026 6:31 pm

పదవి రాకముందే పోతుందా? విప్ భయంతో హైదరాబాద్ నుంచి వెనక్కి తిరిగిన కౌన్సిలర్ అభ్యర్థి!

చంటి ఛానల్ ,బోధన్: మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ లేకపోవడంతో, అధికార పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు జోరుగా ప్రయత్నాలు సాగించారు. ఇందులో భాగంగానే ఒక ప్రముఖ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా విజయం సాధించిన వ్యక్తిని ప్రలోభపెట్టి హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న సదరు పార్టీ అధినేత తక్షణమే స్పందించి.. పార్టీ గుర్తుపై గెలిచినందున ఫిరాయింపులకు పాల్పడితే ‘విప్’ జారీ చేస్తామని, తద్వారా పదవి చేపట్టకముందే అనర్హత వేటు పడుతుందని గట్టిగా హెచ్చరించారు. దీంతో పదవి కోల్పోతామన్న భయంతో మనసు మార్చుకున్న ఆ అభ్యర్థి, హుటాహుటిన తిరిగి సొంత గూటికి చేరుకోవడంతో అధికార పార్టీ వేసిన స్కెచ్ బెడిసికొట్టినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్