Explore

Search

November 7, 2026 7:18 pm

మున్సిపల్ ఎన్నికల బందోబస్తుపై పోలీస్ కమిషనర్ సమీక్ష

చంటి ఛానల్, బోధన్: మున్సిపల్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., అధికారులను ఆదేశించారు. సోమవారం బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సమస్యత్మాక, అతిసమస్యత్మాక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరించాలని, అవసరమైతే స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మద్యం, నగదు వంటి అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద నిఘా పెంచాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, పలువురు సీఐలు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్