చంటి ఛానల్,బోధన్: మండలంలోని పెంటకుర్ద్ గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ (కారోబార్) నీరుడి బాబు (38) అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. పంచాయతీ కార్యదర్శి ఉదయభాస్కర్ గత కొంతకాలంగా తన భర్తను మానసికంగా వేధిస్తున్నారని, ఇంటి పన్నుల వసూళ్ల విషయంలో అందరి ముందు అవమానించడం వల్లే మనస్తాపానికి గురై బాబు పురుగుల మందు తాగారని మృతుడి భార్య కవిత ఆరోపించారు. ఈ నెల 05న ఆత్మహత్యాయత్నం చేసిన బాబు, నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారు. మృతుడు రాసిన ఆత్మహత్య లేఖ లభ్యం కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు బోధన్ పోలీసులు పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

