Explore

Search

November 7, 2026 6:31 pm

సంచలనం: 26వ వార్డులో బిర్కూర్ శ్రీనివాస్ రెడ్డి ‘సొంత నిధుల’ మేనిఫెస్టో!

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 26వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బిర్కూర్ శ్రీనివాస్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చారు. “ప్రజా సేవయే నా కర్తవ్యం – వార్డు అభివృద్ధియే నా లక్ష్యం” అనే నినాదంతో, తన సొంత నిధులతో వార్డు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా వార్డులో ఆడబిడ్డ పుడితే 5001/-, పెళ్లికి 11001/- రూపాయల ఆర్థిక సాయం అందజేస్తానని, అర్హత ఉండి పెన్షన్ రాని వారికి నెలకు 1000/- రూపాయలు తన సొంత డబ్బుల నుండి ఇస్తానని హామీ ఇచ్చారు. వీటితో పాటు ఉచిత హెల్త్ క్యాంపులు, సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం వంటి కీలక అభివృద్ధి పనులను చేస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఫిబ్రవరి 11న జరగబోయే ఎన్నికల్లో ‘కారు’ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్