Explore

Search

November 7, 2026 6:44 pm

18వ వార్డులో కారు జోరు: కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన ఆయేషా ఫాతిమా.

చంటి ఛానల్, బోధన్: పట్టణంలోని 18వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా వార్డులో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలయ్యేలా తాము నిరంతరం పోరాడుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్