Explore

Search

November 7, 2026 6:44 pm

మునిసిపల్ ఎన్నికల నగారా.. అధికారులకు శిక్షణ!

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని లైన్స్ క్లబ్ సమావేశ హాల్‌లో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులు (POs), సహాయ ప్రిసైడింగ్ అధికారులకు (APOs) ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ (ACLB) అంకిత్మ, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో హాజరై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల ప్రక్రియపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన కల్పించగా, ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అశోక్, మునిసిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ మరియు ఇతర మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్