Explore

Search

November 7, 2026 7:18 pm

పాన్ గల్లీలో జోరుగా జూదం.. ఖాకీల కళ్లుగప్పి పేకాట స్థావరాలు!

చంటి ఛానల్,బోధన్: పట్టణంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పట్టణంలోని పాన్ గల్లీ ప్రాంతంలో నిత్యం జోరుగా పేకాట సాగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ ప్రాంతంలో పేకాట స్థావరాలు వెలుస్తూనే ఉండటం గమనార్హం. జూదగాళ్లకు అసలు పోలీసులంటే భయం ఉందా లేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బహిరంగంగా సాగుతున్న ఈ అసాంఘిక కార్యకలాపాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్