Explore

Search

November 7, 2026 6:06 pm

ఇందూర్ హైస్కూల్‌లో ఘనంగా సైన్స్ ఫెయిర్

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని ఆచన్‌పల్లిలో గల ఇందూర్ హైస్కూల్‌లో మంగళవారం ‘క్రియేటివ్ కిడ్స్ క్రాఫ్ట్స్ మేళా’ పేరుతో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టింది. ఈ ప్రదర్శనలో మొత్తం 600 మంది విద్యార్థులు రూపొందించిన 200 వినూత్న ప్రాజెక్టులు, నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బోధన్ మండల విద్యాధికారి (MEO) నాగయ్య విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి, వారి ప్రతిభను అభినందించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, మేధస్సును పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కోడాలి కిషోర్, విద్యా వికాస్ జూనియర్ కళాశాల ఛైర్మన్ యార్లగడ్డ శ్రీనివాస్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ముస్త్యాల హరికృష్ణ, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఇన్‌చార్జి స్వాతి, డైరెక్టర్ కృష్ణారావు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్