Explore

Search

November 7, 2026 6:21 pm

బిఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన పలువురు నాయకులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి షాక్ తగిలింది. పట్టణంలోని 33వ వార్డు బిఆర్ఎస్ నాయకుడు రుద్ర ఉమా సత్యనారాయణతో పాటు, 37వ వార్డు బిఆర్ఎస్ వార్డు ప్రెసిడెంట్ అరుగొండ రవి, దేవ శంకర్, ప్రవీణ్, నవీన్, దేవా సాయిలు, శైలేందర్ వంటి పలువురు బిఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తామని, ఆయన వెంటే ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్