Explore

Search

November 7, 2026 6:21 pm

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం: భారీ ర్యాలీ నిర్వహణ

చంటి ఛానల్, బోధన్: 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, తహసీల్దార్ విట్టల్ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విట్టల్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత తమ బాధ్యతను గుర్తించి ఓటు నమోదు చేసుకోవాలని, ఎన్నికల సమయంలో తమ ఓటును వేసి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విద్యా వికాస్ విద్యాసంస్థ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో బోధన్ ఎస్హెచ్వో (SHO) వెంకటనారాయణ, విద్యా వికాస్ చైర్మన్ శ్రీనివాసరావు, ఆర్‌ఐ గంగాధర్, విద్యార్థులు, విద్యాసంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్