Explore

Search

November 7, 2026 6:44 pm

ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలపై ‘బోధన్ జేఏసీ’ గర్జన

చంటి ఛానల్,బోధన్: ప్రైవేట్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, అధిక ఫీజుల దోపిడీని ఆపాలని విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ చైర్మన్ డి. నాగరాజ్ మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు, వ్యాన్లను నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్‌టీవోను కోరారు. పరీక్షల్లో మాస్ కాపింగ్‌కు పాల్పడితే ఊరుకోమని, ప్రైవేట్ టీచర్లకు పీఎఫ్, హెల్త్ కార్డ్స్ అందించాలని డిమాండ్ చేశారు. త్వరలో ఈ సమస్యలపై హైదరాబాద్‌లో ఆర్టీఐ (RTI) కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని, అనంతరం ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్