చంటి ఛానల్,బోధన్: ”మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీ మారుదామని ప్లాన్ చేస్తున్న వారు ఒక్కటి గుర్తుంచుకోవాలి.. గోడ దూకినంత మాత్రాన మీరు గెలిచినట్టు కాదు!” అంటూ బోధన్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ నిప్పులు చెరిగారు. పార్టీ అండతో పదవులు అనుభవించి, ఇప్పుడు కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ గూటికి చేరాలనుకోవడం రాజకీయ వ్యభిచారమేనని మండిపడ్డారు. పార్టీ మీకు టికెట్లు ఇచ్చి అండగా ఉండటానికి సిద్ధంగా ఉన్నా, ద్రోహం చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని.. అధికారం కోసం ఆశపడి వెళ్తే అక్కడ మీకు భంగపాటు తప్పదని హెచ్చరించారు. కమలం నీడలో ఎదిగి, ఇప్పుడు హస్తం వైపు చూస్తున్న నాయకులకు శ్రీధర్ చేసిన ఈ ఫైరింగ్ కామెంట్స్ బోధన్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

