Explore

Search

November 7, 2026 7:08 pm

ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ జేఏసీ ఎన్నిక

చంటి ఛానల్,నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్-కామారెడ్డి జిల్లాల దేవాదాయ శాఖ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నూతన కార్యవర్గాన్ని జిల్లా సహాయ కమిషనర్ విజయ రామారావు సమక్షంలో మంగళవారం ఎన్నుకున్నారు. జేఏసీ అధ్యక్షుడిగా ఎస్. రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. రాములు, ఉపాధ్యక్షుడిగా జి. వేణు ఎన్నికయ్యారు. అర్చకులు, కార్యాలయ సిబ్బంది, ఈవో ల సమస్యల పరిష్కారం కోసం ఈ కమిటీ కృషి చేస్తుందని అధ్యక్షులు రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు ప్రభు రామచంద్రం, వేణు, కోశాధికారి రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్