Explore

Search

November 7, 2026 6:21 pm

690 మహిళా సంఘాలకు రూ. 1.99 కోట్ల చెక్కుల అందజేత..

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. సోమవారం పట్టణంలోని లయన్స్ ఐ హాస్పిటల్ మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 690 మహిళా సంఘాలకు సంబంధించి రూ. 1,99,27,257 విలువైన వడ్డీ లేని రుణాల రాయితీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, మెప్మా పీడీ సాయ గౌడ్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, జిల్లా సమన్వయకర్త మాధురి లత, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు రఫియా సుల్తానా, మెప్మా సిబ్బంది, వార్డుల మహిళా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్