Explore

Search

November 7, 2026 6:11 pm

​రూ. 299/- లకే ఇంటి వద్దకే మేడారం ప్రసాదం: బోధన్ డిపో మేనేజర్ విశ్వనాథ్

చంటి ఛానల్,బోధన్: మేడారం జాతరకు వెళ్ళలేని భక్తుల కోసం టీజీ ఆర్టీసీ కార్గో విభాగం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించిందని బోధన్ డిపో మేనేజర్ బి. విశ్వనాధ్ తెలిపారు. కేవలం రూ. 299/- చెల్లిస్తే సమ్మక్క-సారక్క ప్రసాదాన్ని నేరుగా ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమాన్ని సోమవారం బోధన్ డిపో కార్యాలయంలో ఆయన కరపత్రాల ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు www.logistics.co.in వెబ్ సైట్ ద్వారా లేదా నేరుగా ఆర్టీసీ కార్గో కౌంటర్ల వద్ద తమ ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని సూచించారు. ఈ ప్రసాదం ప్యాకేజీలో బంగారం (బెల్లం), పసుపు, కుంకుమతో పాటు అమ్మవార్ల ఫోటో ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్గో DME కిశోర్, కార్యాలయ సిబ్బంది గిరి, రాములు, సందీప్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్