Explore

Search

November 7, 2026 6:21 pm

ప్రింట్ మీడియా అధ్యక్షుడిగా కారం స్వామి ఎన్నిక

చంటి ఛానల్,బోధన్: దళితరత్న అవార్డు గ్రహీత, మాల మహానాడు బోధన్ డివిజన్ ఉపాధ్యక్షులు, ‘మన తెలంగాణ’ సీనియర్ పాత్రికేయులు కారం స్వామి బోధన్ ప్రింట్ మీడియా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత కొన్నేళ్లుగా జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఆయన, సామాజిక అంశాలపైన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన ఎన్నిక పట్ల తోటి పాత్రికేయులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, స్వామి నాయకత్వంలో ప్రింట్ మీడియా మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్