Explore

Search

November 7, 2026 6:44 pm

బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం (జనవరి 19న) ఉదయం 11 గంటలకు పట్టణంలోని ‘అప్నా ఫంక్షన్ హాల్’లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.ఆర్. సురేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ వి.జి. గౌడ్ హాజరుకానున్నారు. పట్టణంలోని 38 వార్డుల నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాండ్ల రవీందర్ యాదవ్ ఒక ప్రకటనలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్