చంటి ఛానల్,బోధన్: కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత పార్లమెంట్ ఇంచార్జ్ ఏత్తోండ రాజేందర్ నివాళులర్పించి, స్వయంగా రక్తదానం చేశారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ గోపాల్ రెడ్డి, కమ్మ సంఘం అధ్యక్షులు శివన్నారాయణ,ఇతర నేతలు పాల్గొన్నారు.

