Explore

Search

November 7, 2026 6:20 pm

రైతు కేజీ గంగారంకు ‘పుడమి పుత్ర’ జాతీయ పురస్కారం

చంటి ఛానల్,నిజామాబాద్ జిల్లా: వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న నిజామాబాద్ జిల్లా సాలురా గ్రామానికి చెందిన రైతు కేజీ గంగారం ప్రతిష్టాత్మకమైన “పుడమి పుత్ర” జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు. సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తూ, తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కేజీ గంగారం సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు దక్కడంపై సాలురా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. మట్టి పుత్రుడిగా కేజీ గంగారం జాతీయ వేదికపై గ్రామానికి గుర్తింపు తీసుకురావడం గర్వకారణమని వారు కొనియాడారు. ఈ ఘనత సాధించిన కేజీ గంగారంకు జిల్లావ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్