చంటి ఛానల్,బోధన్: తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపల్, ఆర్టీఏ, ఆర్టీసీ కార్యాలయాల్లో ‘Arrive-Alive’ అవగాహన సదస్సులు నిర్వహించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, ఎంఆర్వో విఠల్, ఎంవీఐ శ్రీనివాస్, డాక్టర్లు సోఫీ, ప్రవీణ్ గుజార్ పాల్గొని హెల్మెట్, సీటు బెల్ట్ ధారణ, అతివేగ నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని అధికారులు సూచించారు.

