Explore

Search

November 7, 2026 6:11 pm

బెల్లల్ గ్రామంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

చంటి ఛానల్, బోధన్: మండలంలోని బెల్లల్ గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ పురస్కరించుకొని గ్రామంలో మహిళలు, యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 60 మంది ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో వాడకట్టును మురిపించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారితో పాటు పాల్గొన్న అందరికీ బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ అన్నపూర్ణ నీలకంఠం గౌడ్, మాజీ సర్పంచ్ సంజీవ్, వార్డు సభ్యులు సంగీత సిమెంట్స్, శాంకబాయి రతన్, కవిత నాగేష్, మల్లేష్, రూప్సింగ్, సతీష్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. గ్రామీణ సంస్కృతిని కాపాడుతూ ఇలాంటి పోటీలు నిర్వహించడం సంతోషకరమని నాయకులు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్