చంటి ఛానల్,బోధన్: టౌన్-1 సెక్షన్ పరిధిలోని రాకాసిపేటలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ కే. నగేష్ , ఏఈ నాయిని కృష్ణ మాట్లాడుతూ, అధికారులు నేరుగా ప్రజల వద్దకే వచ్చి విద్యుత్ సమస్యలను తెలుసుకొని సత్వరం పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసేటప్పుడు విద్యుత్ లైన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తడి చేతులతో స్విచ్‌లు ముట్టుకోవద్దని,నాణ్యమైన ఐఎస్ఐ (ISI) పరికరాలనే వాడాలని వినియోగదారులకు సూచించారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు, లూజ్ వైర్ల వంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని కోరుతూ భద్రతా సూత్రాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ ఓంప్రకాష్, ఇతర విద్యుత్ సిబ్బంది, రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు.

